యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ వీడియోలు, ఫోటోలు తీయడమే కాదు వీటిని చూపించి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడో కామాంధుడు. 

విశాఖపట్నం: తల్లి లేదు... తండ్రి మంచానపడ్డాడు. ఇలా పెద్దదిక్కు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని యువతిని ప్రేమపేరిట నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడో దుండగుడు. యువతిపై అత్యాచారానికి పాల్పడుతూ వీడియోలు, ఫోటోలు తీయడమే కాదు వీటిని చూపించి బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఇలా ఒక్కసారి కాదు రెండుసార్లు గర్భాన్ని కూడా తీయించాడు. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

విశాఖపట్నం అక్కయ్యపాలెంలోని ఓ ప్రైవేట్ ఆఫీసులో జ్యోతి(పేరు మార్చాం) అనే పనిచేస్తోంది. అదే ఆఫీస్ లో శ్రీకాకుళం జిల్లా రాజాం దగ్గర్లోని సుందరాడ గ్రామానికి చెందిన జగదీశ్వర రావు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో యువతికి పెద్దదిక్కు లేదని తెలుసుకున్న జగదీష్ ఆమెను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా యువతిపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఫోటోలు, వీడియోలు తీసి బెదిరించి నిత్యం లైంగికదాడికి పాల్పడేవాడు. 

 read more తలిదండ్రులు లేని బాలికపై.. అన్నయ్య వరసయ్యే వ్యక్తి లైంగికదాడి.. !!

ఇలా అతడి చేతిలో లైంగికదాడికి గురయిన యువతి రెండుసార్లు గర్భం దాల్చింది. గర్భాన్ని తొలగించే మందులను యువతితో మిగించి గర్భం పోయేలా చేశారు. ఆ తర్వాత కూడా యువతిపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడేవాడు. అయితే యువతి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా మరింత వేధించడం ప్రారంభించాడు. 

దీంతో యువతి తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి వైద్యపరీక్షల నిమిత్తం కేజిహెచ్ కు తరలించగా యువతి మళ్లి గర్భవతి అని తేలింది. అయితే అధిక రక్తస్రావం కారణంగా అబార్షన్ చేశారు డాక్టర్లు. యువతి జీవితాన్ని పాడుచేసిన నిందితుడు జగదీష్ ను ఒప్పించి పెళ్లి చేసి యువతికి న్యాయం చేయాలని వైజాగ్ వాసులు కోరుతున్నారు.