గుంటూరు: ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా హతమార్చడమే కాకుండా... మృతదేహం చేతులను నరికి తీసుకువెళుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు దుండగులు. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం రామచంద్రాపురంలో ఓ యువకుడి హత్య జరిగింది. యువకుడిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు దుండగులు. అంతటితో ఆగకుండా ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా మృతదేహం నుండి శరీర బాగాలను వేరు చేశారు. ఇలా చేతులను కూడా నరికి ఓ బస్తాలో వేసుకుని వెళ్లారు దుండగులు. 

అయితే నల్లపాడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ ఈ దుండగులను కూడా ఆపారు. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో చేతిలో వున్న సంచిన ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. సంచిన మనిషి చేతులు వుండటంతో వారిని అందుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా  అసలు నిజాన్ని ఒప్పుకున్నారు.

దీంతో నిందితులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే మృతదేహంతో పాటు నిందితుల వద్ద లభించిన చేతులను కూడా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.