అవినీతితో ఎదిగిన వారికి త‌గిన బుద్ది చెప్పాలని ప్రజలకు బాలయ్య పిలుపు ప్ర‌తి ప‌క్షాలు అధికారం కోసం అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని ఎద్దేవా టీడీపీ ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి.
అవినీతితో ఎదిగిన వారికి తగిన బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మేల్యే, సిని నటుడు బాలకృష్ణ. ప్రతిపక్షాలు అవినీతికి పెట్టింది పేరుగా ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలను బాలయ్య చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా ఆయన బుధవారం గోస్పాడులో రోడ్ షో నిర్వహించారు.
ప్రతి పక్షాలు అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమేత్తారు బాలయ్య. స్వార్ధం కోసమే శిల్పా మోహన్రెడ్డి, చక్రపాణిరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారని ఆయర ఆరోపించారు. టీడీపీ మాత్రమే రాష్ట్ర అభివృద్దికి కట్టుబడి ఉందని ఆయన పెర్కొన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం టీడీపీతోనే జరుగుతుందని బాలయ్య ప్రజలను ఉద్దేశించి తెలిపారు. టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మనందారెడ్డి ని గెలిపించాలని ఆయన కోరారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండడంతో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది. ఆయన ఒక్క రోజు నంద్యాల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గోంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
