Asianet News TeluguAsianet News Telugu

రక్షణ కల్పించాలంటూ.. ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ లంచ్ మోషన్ పిటిషన్..

మోడీ పర్యటన సందర్భంగా తాను భీమవరం వెల్లడానికి అనుమతించాలని.. రక్షణ కల్పించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. 
 

YCP rebel MP Raghurama lunch motion petition in AP High Court
Author
Hyderabad, First Published Jul 1, 2022, 12:49 PM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంపీ ragurama krishnamraju లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నెల 4న భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు రానున్నారు. దీనికి హాజరయ్యేందుకు తనకు రక్షణ కల్పించాలని రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ఈ పిటిషన్ మీద విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. 

‘ఎంపీగా మీరు పర్యటనకు వెళ్లవచ్చు కదా’ అని రఘురామ తరఫు లాయర్ ఉమేష్ చంద్రను ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ... ఏదో ఒక కేసు పెట్టి తన క్లయింట్ ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని రఘురామ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఎలాంటి కేసులు లేకుండా రక్షణ కల్పించాలని.. భీమవరం వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరారు. 

నా గుండెలపై కూర్చొని కొట్టారు.. ఫోన్ కోసం వెతికి మరి చిత్రహింసలు : రఘురామ సంచలనం

ఇదిలా ఉండగా, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మే 3న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వరుసపెట్టి జరుగుతున్న హత్యలు, అత్యాచారలపై మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతల మీద కీలక వ్యాఖ్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు హత్యలు, ఆరు మానభంగాలు అని చెబుతోంటే బాదేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లేని చట్టాల గురించి తమ పారట్ీ నేతలు మాట్లాడతారంటూ రఘురామ చురకలంటిచారు. ఏపీలో ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడిస్తోందని ఆయన దుయ్యబట్టారు. 

మహిళల మీద నేరాల్లో 2020లో ఏపీ ఎనిమిదవ స్థానంలో ఉందన్న రఘురమ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఘటనల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే మహిళల మీద భౌతిక దాడుల్లో మొదటి స్థానంలో ఉందని 2019తో పోలిస్తే రాష్ట్రంలో 63శాతం మేర నేరాలు పెరిగాయని రఘురామ కృష్ణంరాజు వివరించారు. ప్రతి 3 గంటలకు ఎస్సీలపై ఓ దాడి జరుగుతోందిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2021లో అత్యధిక లాకప్ డెత్ లు ఏపీలోనే నమోదయ్యాయని, తన అదృష్టం బాగుండి పోలీసుల కస్టడీ నుంచి ప్రాణాలతో బయటపడ్డానంటూ వ్యాఖ్యానించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios