Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తా: రఘురామ సంచలనం

వైసీపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు చెప్పారు.ఈ విషయమై ఆయన సోమవారం నాడు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

YCP rebel MP Raghu Rama Krishnam Raju sensational comments
Author
Amaravati, First Published Oct 18, 2021, 4:41 PM IST

అమరావతి: ycp రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని  ఆ పార్టీ రెబెల్ ఎంపీ Raghurama krishnam raju ప్రకటించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని  ఆయన డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తను కాబట్టే తనను పార్టీలోంచి తొలగించలేదని తెలిపారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. 

also read:జగన్‌కు ఝులక్.. కేంద్ర మంత్రితో నేను మాట్లాడతా, మండలి రద్దుపై మళ్లీ కెలికిన రఘురామ

వైసీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.  తనపై దాఖలైన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని Lok sabha స్పీకర్ Om Birlaకు లేఖ రాశాడు.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపంతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ స్పీకర్ ఓం బిర్లాకు రెండు దఫాలు ఫిర్యాదు చేసింది. 

రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను కూడ ఆ పార్టీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇదే విషయమై  తనపై దాఖలైన అనర్హత పిటిషన్ ను కొట్టివేయాలని ఆ లేఖలో రఘురామకృష్ణంరాజు కోరారు.రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది మే 14న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేశారు.  

ఇదిలా ఉంటే ఏపీ సీఎం Ys Jagan, ఆ పార్టీకి చెందిన ఎంపీ Vijayasai Reddy ల బెయిల్ రద్దు చేయాలని తాను కోర్టును  ఆశ్రయించడంతోనే తనను అరెస్ట్ చేశారని రఘురామకృష్ణంరాజు అప్పట్లో ఆరోపణలు చేశారు. పార్టీకి దూరమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ఏ కార్యక్రమం తీసుకొన్నా దానిపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొన్న కార్యక్రమాలపై ఆయన మండిపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios