Asianet News TeluguAsianet News Telugu

హీటెక్కిన గన్నవరం వైసీపీ రాజకీయాలు: మూడు గంటలు యార్లగడ్డ, దుట్టా భేటీ

గన్నవరం వైసీపీకి చెందిన దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావులు  నిన్న  మూడు గంటల పాటు సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ  వైసీపీలో  చర్చకు దారితీసింది. 
 

ycp politics heats up after yarlagadda venkata rao meets dutta ramachandra rao
Author
First Published Jan 15, 2023, 1:14 PM IST


 విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం  అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీలో  మరోసారి  కలకలం  చోటు  చేసుకుంది.  వైసీపీ నేతలు  యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులు  శనివారం నాడు సమావేశం  కావడం వైసీపీలో  చర్చకు దారితీసింది. సుమారు మూడు గంటల పాటు  ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల విషయమై వీరిద్దరి మధ్య  చర్చ జరిగినట్టుగా  ప్రచారం సాగుతుంది.  త్వరలోనే ఈ ఇద్దరు నేతలు  మూడు గంటల పాటు  సమావేశమయ్యారు.   ఈ పరిణామాలతో  గన్నవరంలో  వైసీపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి.

గత ఎన్నికల్లో  ఈ అసెంబ్లీ స్థానం నుండి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు.  ఎన్ఆర్ఐగా  ఉన్న యార్లగడ్డ వెంకటరావు  రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నికలకు ముందు  ఆయన  ఇండియాకు వచ్చారు. గన్నవరం నుండి వైసీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యారు.   ఆ తర్వాత  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  వల్లభనేని వంశీ  టీడీపీని వీడి  వైసీపీలో చేరారు. దీంతో   గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని వైసీపీలో  మూడు వర్గాలు ఏర్పడ్డాయి.  వల్లభనేని వంశీ  వైసీపీలో  చేరిన తర్వాత  యార్లగడ్డ వెంకటరావు,  దుట్టా రామచంద్రరావుల మధ్య సఖ్యత మరింత పెరిగింది. 

also read:బెదిరింపులకు భయపడను:వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావు కౌంటర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  వల్లభనేని వంశీకే వైసీపీ టికెట్ ను కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. దీంతో  వంశీకి టికెట్ కేటాయించవద్దని  దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు వర్గాలు  ప్రయత్నిస్తున్నాయి.  గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో   ఈ ముగ్గురు నేతల మధ్య   సమన్వయం కోసం  వైసీపీ నాయకత్వం  అనేక ప్రయత్నాలు  చేసింది.  గతంలో  వైసీపీ  రాష్ట్రప ్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి  వద్ద గన్నవరం పంచాయితీ జరిగింది.  ఈ విషయమై  సీఎం జగన్  కూడా   ముగ్గురు నేతలను పిలిపించి మాట్లాడారు.  

ఈ నియోజకవర్గంలో  యార్లగడ్డ వెంకటరావు , వల్లభనేని వంశీకి చెందిన వర్గాల మధ్య గతంలో పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి.  గత ఏడాది  ఆగష్టు 6వ తేదీన ఈ రెండు వర్గాల కార్యకర్తలు బాహబాహీకి దిగారు. ఈ రెండు వర్గాలు నియోజకవర్గంలో  ఆధిపత్యం కోసం ప్రయత్నాలు  చేస్తున్నాయి. ఈ క్రమంలోనే  రెండు  వర్గాలు  గొడవకు దిగిన  సందర్భాలు  చోటు  చేసుకున్నాయి.  నియోజకవర్గంలో  పార్టీ బాధ్యతలను  వంశీకే   నాయకత్వం కట్టబెట్టింది.  అయితే  ఈ  తరుణంలో  దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావులు  సమావేశం కావడం  ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios