స్పీడ్ పెంచిన శిల్పా

First Published 2, Apr 2018, 10:16 AM IST
Ycp nandyala leader silpa mohanreddy triggered his plans for next elections
Highlights
వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఏవి చేసిన ప్రకటన జిల్లా పార్టీలో సంచలనంగా మారింది.

మాజీ మంత్రి, వైసిపి నేత శిల్పా మోహన్ రెడ్డి జోరు పెంచారు. మొన్నటి ఉపఎన్నికలో వైసిపి తరపున పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు. అయితే, టిడిపిలో మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ణ్యా మళ్ళీ జోరు పెంచారు.  నంద్యాల, ఆళ్ళగడ్డలో గట్టిపట్టున్న టిడిపి నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ, మంత్రి భూమా అఖిలప్రియపై తిరుగుబాటు లేవదీసిన సంగతి అందరికీ తెలిసిందే.

ప్రస్తుత పరిస్ధితులను బేరీజు వేసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇటు ఆళ్ళగడ్డ అయినా అటు నంద్యాలలో అయినా టిడిపి అభ్యర్ధులు గెలుపు అంత ఈజీ కాదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డ నుండి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఏవి చేసిన ప్రకటన జిల్లా పార్టీలో సంచలనంగా మారింది.

కారణాలేవైనా కానీ వచ్చే ఎన్నికల్లో ఏవి కూడా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఏవితో వివాదం వల్ల భూమా కుటుంబానికి సమస్యలు మొదలైనట్లే. ఎందుకంటే నంద్యాలలో అయినా ఆళ్ళగడ్డలో అయినా ఏవికి మంచి పట్టున్న విషయం అందరికీ తెలిసిందే.

ఎప్పుడైతే మంత్రిపై ఏవి తిరుగుబాటు చేశారో వెంటనే శిల్పా రంగంలోకి దిగేశారు. నంద్యాల నియోజకవర్గంలో తన మద్దతుదారులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారట. టిడిపిలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎన్నికలు కూడా ఎంతో దూరం లేవు కాబట్టి మండలాల వారీగా మద్దతుదారులతో శిల్పా తాజాగా భేటీలు నిర్వహిస్తున్నారు. టిడిపిలో మొదలైన ముసలం వల్ల ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచితీరాలని శిల్పా ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

loader