బ్రేకింగ్ : క్షీణించిన వైవి ఆరోగ్యం..ఆసుపత్రికి తరలింపు

బ్రేకింగ్ : క్షీణించిన వైవి ఆరోగ్యం..ఆసుపత్రికి తరలింపు

ఢిల్లీలోని ఏపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ప్రత్యేకహోదా డిమాండ్ తో గడచిన నాలుగు రోజుల క్రితం  వైసిపి ఎంపిలు ఐదుమంది ఆమరణ నిరాహార దీక్షలు మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

సోమవారం ఉదయం వైవిని పరీక్షించిన వైద్యులు వెంటనే  ఎంపిని రామ్మోనహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. సుబ్బారెడ్డి బిపి, షుగర్ లెవల్స్ లో బాగా తేడా రావటంతో పూర్తిగా నీరసపడిపోయారు.

దీక్ష విరమించాలని వైద్యులు  చెప్పినా వినకపోవటంతో పోలీసుల సాయంతో వైవిని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్ ల ఆరోగ్యం క్షీణించటంతో ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. దీక్షలో ఇక మిగిలింది మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్రమే.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos