అమరావతి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ముడిపెడుతూ సోషల్ మీడియా వేధికన సెటైర్లు విసిరారు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి. అధ్యక్షుడిగా తాను ఎన్నికవడానికి చంద్రబాబే కారణమని... అధ్యక్ష ఎన్నికల్లో లోకేషం పోటీచేయకపోవడం వల్లే తాను గెలిచానని బైడెన్ సన్నిహితులతో  చెబుతున్నట్లు విజయసాయి ఎద్దేవా చేశారు.  
 
'''నేను అమెరికా అధ్యక్షుడు అయ్యానంటే దానికి కారణం చంద్రన్నే...' సన్నిహితులతో జో బైడెన్! హిల్లరీకి  పలికినట్లు నాకు చంద్రన్న మద్దతు  ఇవ్వకపోవడం వల్లే  ఇది సాధ్యమయ్యిందన్న  బైడెన్. లోకేశం పోటీచేసినట్లైతే  బైడెన్ కి డిపాజిట్లు గల్లంతయ్యేవి!'' అంటూ చంద్రబాబుపై విజయసాయి ట్విట్టర్ వేదికన సెటైర్లు విసిరారు.   

''ఆయన ‘సలహాల’తోనే జో బైడెన్ గెలిచాడు అంటే, ఆట పట్టిస్తున్నారని ఆక్షేపిస్తారు గాని బాబు చెప్పే ‘కథలు’ అలాగే ఉంటాయి. ఎవరు విజయం సాధించినా, దేని గురించైనా నలుగురు ప్రశంసా పూర్వకంగా మాట్లాడుకున్నా అది నావల్లనే జరిగింది అంటాడు. పోసుకోలు కబుర్లవల్ల నవ్వులపాలు అవుతున్నా గ్రహించడు'' అన్నారు విజయసాయి రెడ్డి.