అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ నేతలపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని,  ఆరోపణ ప్రజారోగ్యంపై దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శలుఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని అన్నారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తారు. కరోనా వైరస్ ఇక్కడిది కాదని, సరిహద్దులు మూసేస్తే ఆగేది కాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ బాబు, అనుకూల మీడియా ప్రభుత్వంపై రోజూ బురద చల్లాలని చూస్తున్నారని ఆరోపించారు. 

ఈఎస్ఐ కుంభకోణంలో రూ.150 కోట్లు దోచుకున్న వీళ్లు ప్రజారోగ్యం గురించి దొంగ ఏడుపులు ఏడుస్తుంటే ఊసరవెల్లులే సిగ్గుపడుతున్నాయని విమర్శించారు. అంతకుముందు మరో ట్వీట్ లోనూ టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేశారు. 

క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇచ్చిన అమరావతి ల్యాండ్ పూలింగ్ జీవో ఒక్కటే కాదు... చంద్రబాబు ఏ జీవో ఇచ్చినా తనకెంత లాభం వస్తుంది, తన వాళ్లకెంత గిట్టుబాటు అవుతుందనే చూస్తాడని ఆరోపించారు. ధూళిపాళ్ల, యనమల, ఉమ, నారాయణ, అచ్చెన్న ఇలా చెప్పుకుంటూ పోతే పేర్లు వందలు దాటతాయని విజయసాయిరెడ్డి అన్నారు.