చంద్రబాబును అసహ్యంగా మాట్లాడిన ఎంపి

Ycp mp vijaya sai used un parliamentary language on chandrababu
Highlights

రాష్ట్ర చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారంటూ ఎంపి ధ్వజమెత్తారు

చంద్రబాబునాయుడుపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారంటూ ఎంపి ధ్వజమెత్తారు. తనను విజయమాల్యాతో పోల్చటంపై ఎంపి మండిపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబుపై చాలా అసహ్యంగా వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబును చార్లెస్ శోభరాజ్ తో పోల్చారు. టిడిపిలో ఉన్న చాలామంది ఎంఎల్ఏలు నేరగాళ్ళే అన్నారు. పేకాట క్లబ్బులు నడుపుతున్న వారు, బ్యాంకులను వందల కోట్ల రూపాయలకు మోసం చేసిన వాళ్ళు టిడిపిలో ఎంపిలుగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. నేరగాళ్ళకే నేత అయిన చంద్రబాబే పెద్ద గజదొంగ అంటూ మండిపడ్డారు. రాయటానికి కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు చేయటం పట్ల అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు

 

loader