బ్రేకింగ్ న్యూస్ : సుజనా, సిఎం రమేష్ ఇద్దరూ నేరస్తులే

First Published 27, Mar 2018, 2:17 PM IST
Ycp mp vijaya sai says tdp mps sujana and cm ramesh are fraudulent
Highlights
అసలు టిడిపి అంటేనే తెలుగు దొంగల పార్టీగా అభివర్ణించారు. వారందరికీ నాయకుడు చంద్రబాబే అంటూ ఎద్దేవా చేశారు.

కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనా, రమేష్ ఇద్దరూ నేరస్తులే అంటూ ధజమెత్తారు. మంగళవారం పార్లమెంటు దగ్గర మీడియాతో మాట్లాడుతూ, అసలు టిడిపి అంటేనే తెలుగు దొంగల పార్టీగా అభివర్ణించారు. వారందరికీ నాయకుడు చంద్రబాబే అంటూ ఎద్దేవా చేశారు.

ఆర్ధిక నేరగాడైన సుజనాను పట్టుబట్టి కేంద్రమంత్రివర్గంలోకి పెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఐదు బ్యాంకులను మోసం చేసి కేసులు ఎదుర్కొంటున్న చరిత్ర సుజనాదే అంటూ మండిపడ్డారు. అందితే జట్టు లేకపోతే కాళ్ళు పట్టుకోవటం టిడిపి నైజమన్నారు. తనపై సిఎం రమేష్ చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు విజయసాయి సవాలు విసిరారు. ఐదు రోజుల్లో సిఎం రమేష్ బండారం మొత్తం బటయపెడతానంటూ హెచ్చరించారు.

loader