తమ పార్టీ గుర్తుపై విజయం సాధించి ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: తమ పార్టీ గుర్తుపై విజయం సాధించి ఫిరాయింపులకు పాల్పడిన నలుగురు ఎంపీలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి శుక్రవారం నాడు ఫిర్యాదు చేశారు.
2014 ఎన్నికల సమయంలో వైసీపీ నుండి విజయం సాధించిన ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుకలు పార్టీ నుండి ఫిరాయించారు. తెలంగాణలో ఖమ్మం నుండి విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడ టీఆర్ఎస్‌లో చేరారు.
గత ఎన్నికల సమయంలో వైసీపీ నుండి విజయం సాధించిన ఎంపీలంతా పార్టీ ఫిరాయించారు. ఈ నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలని చాలా కాలంగా కిందటే ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని విజయసాయిరెడ్డి స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలపై చర్యలు తీసుకోకపోతే రాజ్యాంగ మూల సూత్రాలకే ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో పార్టీ ఫిరాయించిన ఎంపీలు శరద్ యాదవ్, అన్వర్ అలీపై చర్యలు తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ తరహలోనే లోక్‌సభలో కూడ పార్టీ ఫిరాయించిన ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Last Updated 3, Aug 2018, 6:44 PM IST