బ్రేకింగ్ న్యూస్: టిడిపికి విజయమాల్యా భారీ విరాళం

Ycp mp vijaya sai alleges naidu has taken Rs 150 Cr donation from liquor king vijayamalya
Highlights
అప్పులు ఎగొట్టి దేశం వదిలి విజయామాల్య పారిపోయిన పది రోజులకు చంద్రబాబు లండన్ వెళ్ళి మాల్యాను కలిసినట్లు చెప్పారు.

తెలుగుదేశంపార్టీకి లిక్కర్ కింగ్, బ్యాంకుల సొమ్ము ఎగొట్టి విదేశాలకు పారిపోయిన విజయామాల్యా భారీ ఎత్తున విరాళం ఇచ్చారా? వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతున్న ప్రకారం అవుననే అనుకోవాల్సొస్తోంది. పార్లమెంటు వద్ద మీడియాతో ఎంపి మాట్లాడుతూ, విజయమాల్యా నుండి చంద్రబాబు పార్టీ విరాళం క్రింద రూ. 150 కోట్లు తీసుకున్నట్లు ఆరోపించారు.

అప్పులు ఎగొట్టి దేశం వదిలి విజయామాల్య పారిపోయిన పది రోజులకు చంద్రబాబు లండన్ వెళ్ళి మాల్యాను కలిసినట్లు చెప్పారు. మాల్యా నుండి తీసుకున్న విరాళానికి చంద్రబాబు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో చంద్రబాబుపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు ఎంపి తెలిపారు.

loader