రెఫరెండం అంటే తెలుసా, భవిష్యత్తులో మరింతగా ఎదురుదాడి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
రానున్న రోజుల్లో టీడీపీపై మరింత ఎదురు డాది చేస్తామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు.టెన్త్ క్లాస్ విద్యార్ధులు కోరితే తమ పార్టీ నేతలు జూమ్ మీటింగ్ లో ప్రత్యక్షమయ్యారన్నారు. తమ పార్టీ నేతలపై అసభ్యంగా మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు.
విజయవాడ:Tenth క్లాస్ విద్యార్ధులతో Nara Lokesh నిర్వహించిన జూమ్ మీటింగ్ లో తమ నేతలు ప్రత్యక్షం కావడం ఆరంభం మాత్రమేనని వైసీపీ ఎంపీ Vijayasai Reddy చెప్పారు. రానున్న రోజుల్లో మరింతగా ఎదురు దాడి చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
శుక్రవారం నాడు NTR District వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ నేతలను అసభ్య పదజాలంతో టీడీపీ నేతలు దూషిస్తున్నారన్నారు. లోకేష్‌కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింని ఆయన సెటైర్లు వేశారు. నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు. అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్ధమౌతుందున్నారు. ఈ విషయాలను ప్రశ్నించటానికి తమ వాళ్లు జూమ్ మీటింగ్ లోకి వెళ్లారన్నారు. చంద్రబాబు, లోకేష్ లు బుద్ది మార్చుకోకపోతే తామే తగిన బుద్ది చెబుామని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
ఇకనైనా పద్దతులు మార్చుకోవాలని విజయసాయిరెడ్డి TDP నేతలకు సూచించారు. టెన్త్ ఫెయిల్ అవటానికి కారణాలు తెలుసుకోవాలేగానీ సీఎంని తిట్టాల్సిన పనేంటని ఆయన అడిగారు. కుసంస్కారంతో తమ నాయకులను తిట్టించకుండా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.. ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహరించాలని కోరారు. లోకేష్ సవాల్‌ని స్వీకరిస్తున్నామన్నారు. చర్చకు రావాల్సిందిగా కోరుతున్నట్టుగా చెప్పారు. Chandrababu వచ్చినా సరే చర్చకు మేము సిద్దమన్నారు. జూమ్ మీటింగ్ లో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు.
ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వర్తించే కార్యక్రమాలు చేస్తోంన్నారు. అందుకే టీడీపీకి కడుపుమంటని విజయసాయిరెడ్డి ఆరోపించారు. Kuppam లో కూడా టీడీపీ ఓడిపోయినప్పుడే లబకు 175 గ్యారెంటీగా వస్తాయని నమ్మకం నెలకొందన్నారు. మీకు దమ్ముంటే ఆత్మకూరులో పొటీ చేసి రెఫరెండం కోరాలని సవాల్ విసిరారు. అసలు లోకేష్ కి రెఫరెండం అంటే తెలుసా అని సెటైర్లు వేశారు. టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితేనే వంశీ, కొడాలి నాని, రజని ఎంటర్ అయ్యారన్నారు. వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి? అని ఆయన అడిగారు.
also read:వివేకానంద హత్య కేసు సీబీఐ విశ్వసనీయతకు పెను సవాల్: చంద్రబాబు
అన్ని జిల్లాల్లోనూ పార్టీకి స్వంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు ఏడాది ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయన్నారు. పార్టీ ఆఫీస్ అంటే దేవాలయం లాంటిదన్నారు. బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. మా కార్యకర్తలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు.. కార్యకర్తలు, నాయకుల వలనే 2019లో అధికారంలోకి వచ్చామని విజయసాయిరెడ్డి అన్నారు.