టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీలకు జడ్జి పదవులు ఇవ్వరాదని, జడ్జిలకు బీసీలు పనికిరారని చంద్రబాబు రాశారని ఆయన ఆరోపించారు.

వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని తప్పుబట్టారు. ప్రత్యేక హోదాను పశువుల సంతలా.. కేంద్రానికి వేలంలో పెట్టి అమ్మిన వ్యక్తి చంద్రబాబు అంటూ  వైసీపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. దొంగలా అమరావతికి పారిపోయారని గోరంట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు దివంగత టీడీపీ నేత పరిటాల రవిపై కూడా గోరంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నక్సలైట్లు, ఫ్యాక్షనిజం పేరుతో పరిటాల రవి ఎంతో మంది తలలు నరికారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు సహకారంతో రవి ఎమ్మెల్యేగా ఇలాంటి పనులు చేశారని గోరంట్ల ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలో పొలాలకు నీరు లేక ఎండిపోతుంటే.. పరిటాల రవి రక్తపు టేర్లతో పొలాలను తడిపారని విమర్శించారు. పంట పొలాలను రక్తంతో తడిపిన చరిత్ర పరిటాల రవిదని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.