చంద్రబాబునాయుడు మీద వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫుల్లుగా ఫైర్ అయ్యారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ఉద్దేశించి సామాజిక, ఆర్దిక, రాజకీయ నేరగాడంటూ ఎంపి విరుచుకుపడ్డారు. చంద్రబాబు దోచుకున్నదంతా రెడ్ మనీ అట. రెడ్ మనీ అంటే ప్రజల కష్టాన్ని రక్తం పీల్చినట్లు పీల్చేసారు కాబట్టే రెడ్ మనీ అంటున్నట్లు చెప్పారు. ప్రజల  కష్టాన్ని సుమారు 1.50 లక్షల కోట్లు దోచుకున్నట్లు విజయసాయి ఆరోపించారు. ప్రతీ విషయాన్ని వక్రీకరించి చూసే నైజం చంద్రబాబుదంటూ మండిపడ్డారు.