దేవినేని ఉమకు పశు వైద్యులతో చికిత్స... అది తగ్గాలంటే ఇదే ట్రీట్మెంట్ : ఎమ్మెల్యే వసంత ఎద్దేవా (వీడియో)
జగనన్న పశు ఆరోగ్య సురక్ష పథకం ద్వారా మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు వైద్యం అందించాలని వెటర్నరీ డాక్టర్లకు వైసిపి ఎమ్మెల్యే సూచించారు

మైలవరం : తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు పిచ్చి పట్టిందని వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎద్దేవా చేసారు. ఆయనకు పిచ్చి తగ్గేలా వైద్యం చేయాలని పశు వైద్యులను కోరారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఉమ వైద్యం చేయించుకోనట్లున్నాడు... ఇప్పుడు జగనన్న పశు ఆరోగ్య సురక్షలో అయినా వైద్యసేవలను పొందాలంటూ ఎమ్మెల్యే ఎద్దేవా చేసారు.
జగన్ సర్కార్ ఎన్టీఆర్ జిల్లాలో జగనన్న పశు ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ... ప్రజలు పట్టించుకోవడం మానేయడంతో రాజకీంగా ఉనికి చాటుకునేందుకే దేవినేని ఉమ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇందుకోసమే తనపైనా, వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆయన పిచ్చి బాగా ముదిరిపోయిందని... జగనన్న పశు ఆరోగ్య సురక్ష ద్వారా వైద్యం అందించాలని సూచించారు. పిచ్చిపట్టి మాట్లాడుతున్న ఉమ పైత్యాన్ని తగ్గించేలా నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నారు. అవసరమైతే ప్రత్యేకంగా ప్రభుత్వమే మందులు అందజేస్తుందని వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
వీడియో
ఇక జగనన్న పశు ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ఎెమ్మెల్యే వసంత మాట్లాడుతూ... మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించేందుకే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందన్నారు. ఈ శిబిరాల్లో పశువులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి ప్రాథమిక వైద్యం అందిస్తారని తెలిపారు. ఒకవేళ సర్జరీలు చేయాల్సి వుంటే ఆ పశువులను డాక్టర్ వైయస్సార్ పశు ఆరోగ్య సేవ అంబులెన్స్ (1962) ద్వారా దగ్గర్లోని వెటర్నరీ పాలీక్లినిక్ లకు తరలించనున్నారని తెలిపారు.
Read More ఆంధ్ర ప్రదేశ్ దివాళా తీసిందనడానికి ఇదొక్కటి చాలదా..!: జగన్ సర్కార్ పై లోకేష్ ఫైర్
పల్లెలు ప్రగతికి పట్టుకొమ్మలు... అలాంటి పల్లెల్లో ఎంతోమంది రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా పాడి పశువులను, మూగజీవాలను పెంచుతూ ఉపాధి పొందుతుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి పాడి రైతులు నూతన శాస్త్రీయ పద్ధతులను, కాలానుగుణ యాజమాన్య పద్ధతులను ఆచరించాలని సూచించారు. మూగజీవాల పెంపకాన్ని లాభసాటిగా తీర్చిదిద్దుకోవాలంటే శాస్త్రీయ పద్దతులు పాటించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాడిరైతుకలు సూచించారు.