రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి తాను అవమానించేలా మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై వైసిపి దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు.
అమరావతి: రాజ్యాంగ రచయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar) ను అవమానించేలా వైసిపి (ysrcp) దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (undavalli sridevi) మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీనిపై వివాదం రేగుతుండటంతో ఎమ్మెల్యే శ్రీదేవి స్పందించారు. తాను అంబేద్కర్‌ను దూషించలేదని... కావాలనే కొంత మంది తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. తన వీడియోను మార్ఫింగ్, ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారని... ఆ వీడియో వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాల దెబ్బతిని ఉంటే క్షమించాలని ఎమ్మెల్యే కోరారు.
ప్రపంచ 4వ మాదిగ మహాసభల్లో తాను మాట్లాడిన వీడియోను ఎమ్మెల్యే శ్రీదేవి మీడియాకు చూపించారు. ఈ వీడియోలో తాను ఎక్కడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను దూషించినట్లు, అవమానకరంగా మాట్లాడినట్లు లేదన్నారు. కానీ ఈ వీడియోను ఎడిటింగ్, మార్ఫింగ్ చేసి తాను డాక్టర్ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడినట్లు సృష్టించారని అన్నారు. దళితుల బలహీన వర్గాలపై జరుగుతున్న కుట్రలో భాగమే తనపై ఈ తప్పుడు ప్రచారాలని శ్రీదేవి పేర్కొన్నారు.
Video
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని శ్రీదేవి పేర్కొన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల గత 75ఏళ్లుగా బహుజనులు తమ హక్కులను పొందుతూ ఎదుగుతున్నారని... ఇది చూసి ఓర్వలేని కొందరు తమ లబ్ధి కోసం తనలాంటి వారిపై కుట్రలు పనుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ ఫలాలను విభిన్న కులాలు, మతాలు, జాతులు, అందరూ సమానంగా అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు.
read more ‘‘జిన్నాటవర్’’ వివాదం.. జగన్ ముందు మీ ఆటలు సాగవు: బీజేపీ నేతలకు వైసీపీ నేత అప్పిరెడ్డి వార్నింగ్
బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన తర్వాత కొంతకాలమే జీవించారని... ఆయన మరణానంతరం కొందరు కులవాదులు బహుజనుల అభ్యున్నతిని అడ్డుకునే ప్రయత్నం చేసారన్నారు. ఈ సమయంలో రాజ్యాంగ కమిటీ సభ్యులుగా పనిచేసిన బాబు జగ్జీవన్ రాం పార్లమెంటులో రాజ్యాంగ ప్రతి ఫలాలలను కింది స్థాయికి చేర్చేందుకు బలియంగా కృషి చేశారన్నారు. ఇదే విషయాన్ని తాను మాట్లాడితే వాటిని వక్రీకరించి ఇతర అర్థాలను ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నారని ఎమ్యెల్యే శ్రీదేవి అన్నారు.
తనపై విష ప్రచారం చేస్తున్నవారు ఎంతటివారయిన వదిలిపెట్టబోనని ఎమ్మెల్యే హెచ్చరించారు. తాను మాట్లాడిన వీడియోని ఎడిటింగ్ చేసి...సోషల్ మీడియాలో విడుదల చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడనున్నట్లు వెల్లడించారు.
read more వంగవీటి రాధా హత్యకు రెక్కీపై ఆధారాలు దొరకలేదు: విజయవాడ సీపీ క్రాంతి రాణా
కులమతాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో తామంతా నడుస్తున్నామని... ఎంతో అంకిత భావంతో పని చేస్తున్నామని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. అలాంటిది ప్రజల్లోకి తమపై తప్పుడు భావాలు తీసుకెళ్లడం వల్ల ఉ ఒక్కరూ లబ్ధి పొందలేరని... ఈ నిజం తెలుసుకొని మసులుకోవాలని ఉండవల్లి శ్రీదేవి హెచ్చరించారు. .
