Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కు వెన్నుపోటులో బాలకృష్ణకు భాగం: వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ

ఎన్టీఆర్  గురించి మాట్లాడే అర్హత బాలకృష్ణకు లేదని వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ విమర్శించారు. ఇవాళ అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

YCP MLA Shankar Narayana  Reacts On Balakrishna Comments
Author
First Published Sep 25, 2022, 2:44 PM IST

అనంతపురం:  ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో బాలకృష్ణకు కూడా భాగం ఉందని వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆరోపించారు.ఆదివారం నాడు  అనంతపురంలో  ఆయన మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. 

ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబుతో పాటు బాలకృష్ణ పరోక్ష కారణమని ఆయన  విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొంటే  చంద్రబాబు దోచుకుంటూ ఉంటే కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు సపోర్ట్ చేశారన్నారు.  కానీ బాలకృష్ణ మాత్రం బావకు సపోర్ట్ చేశాడని చెప్పారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హత బాలకృష్ణకు లేదని ఎమ్మెల్యే శంకర్ నారాయణ తెలిపారు. ఎన్టీఆర్ కు  చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తుంటే బాలకృష్ణ ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు.చంద్రబాబుతో బాలకృష్ణ ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. లోకేష్, బ్రహ్మణి పెళ్లి గురించి బాలకృష్ణ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని శంకర్ నారాయణ విమర్శించారు. సినిమాలు లేనప్పుడే  బాలకృష్ణ రాజకీయాలు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. 

also read:బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే.. కుటుంబ సభ్యులు ఏమయ్యారు : మంత్రి విడదల రజనీ

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్టీఆర్ అన్నది పేరు కాదు ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్ పోర్టు పేరును మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. జగన్ హెల్త్ యూనివర్శిటీకి ఉన్నఎన్టీఆర్ పేరును మార్చారన్నారు. విశ్వాసం లేని వాళ్లను చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మండిపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios