వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అస్వస్థత. చెన్నై అపోలో హాస్పిటల్ లో ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ మేరకు రోజాకు రెండు మేజర్ ఆపరేషన్ లు జరిగినట్టు భర్త సెల్వమణి వెల్లడించారు.

రోజా ఆరోగ్య పరిస్తితి మీద ఆందోళన పడాల్సిందేమీ లేదని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆడియో విడుదల చేశారు. ఐసీయూ నుంచి ఇవాళ వార్డుకు తరలించారు. 

అయితే రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని, రెండు వారాల పటు విశ్రాంతిలో ఉండనున్నారని ఆమె భర్త సెల్వమణి తెలిపారు. అభిమానులెవ్వరూ హాస్పిటల్ కి రావొద్దని ఆడియో టేప్ రిలీజ్ చేశారు.