ఏపీ మంత్రి వర్గ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. శనివారం నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా... వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి కేటాయిస్తారా లేదా అన్న విషయంపై మీడియాలో రోజూ కథనాలు వెలువడుతున్నాయి. కాగా... తనకు మంత్రి పదవి వచ్చే అవకాశంపై రోజా మీడియాతో తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది సీఎం జగన్ నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. మంత్రి పదవి కావాలని ఇంతవరకూ తాను అడగలేదని రోజా తెలిపారు. పార్టీ కోసం తాను ఎంతగా కష్టపడ్డానో జగన్‌కు తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. తాను ఐరన్‌లెగ్ కాదని, చంద్రబాబు తనపై అలా దుష్ప్రచారం చేశారని నగరి ఎమ్మెల్యే రోజా చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఖాయమనే వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కూడా మంత్రి పదవి దక్కొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. వీరిద్దరితో పాటు ఎమ్మెల్యే రోజాకు కూడా ఈ విడతలోనే మంత్రి పదవి దక్కుతుందా లేక ఈసారికి ఈ ఇద్దరితోనే సరిపెడతారా అనేది నేడు తేలిపోనుంది.