Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్లలో చేసిందేంటీ.. పెన్షన్లకు ఓట్లు వేస్తారా, టీడీపీ కూడా ఇచ్చింది : జగన్ ప్రభుత్వంపై ఆనం విమర్శలు

ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారా, గత ప్రభుత్వం కూడా పెన్షన్ ఇచ్చిందని, ఏమైందని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలని ఆనం నిలదీశారు. 
 

ycp mla anam ramanarayana reddy serious comments on ys jagan governance
Author
First Published Dec 28, 2022, 3:46 PM IST

సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్లు, గుంతలు పూడ్చలేకపోతున్నామన్నారు. తాగేందుకు నీళ్లు లేవంటే కేంద్రం నిధులిస్తోందని... అప్పుటు నీళ్లిస్తామని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. కేంద్రం నిధులిస్తే మీరేం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు అడగాలని ఆనం ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లేమైనా కట్టామా... పనులు మొదలుపెట్టామా అని ఆయన నిలదీశారు. పెన్షన్ ఇస్తే ఓట్లు వేస్తారా, గత ప్రభుత్వం కూడా పెన్షన్ ఇచ్చిందని, ఏమైందని ఆనం ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పానని, లే ఔట్లు వేశామే కానీ ఇళ్లు కట్టామా అని ఆనం రామనారాయణ రెడ్డి నిలదీశారు. 

కాగా.. అధికారులతో సమీక్ష సందర్భంగా వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు. 

Also Read: జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారు.. అధికారులపై కోటంరెడ్డి ఆగ్రహం, మంత్రి కాకాణి ముందే

మంత్రులు మారినా పనులు జరగడం లేదంటూ శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా వున్నప్పుడు హామీ ఇచ్చిన పనులు ఇంకా మొదలు కాలేదని ఆయన దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలోని కొత్త రోడ్ల నిర్మాణంపైనా కోటంరెడ్డి అధికారులపై మండిపడ్డారు. పొట్టేపాలెం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. దీనిపై అధికారుల్ని అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఇదంతా చూసి జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారంటూ మంత్రి కాకాణి ముందే కోటంరెడ్డి శ్రీధన్ రెడ్డి అధికారులకు క్లాస్ పీకారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios