గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. ఇదివరకు ఓసారి కరోనా వైరస్ వ్యాధికి గురై చికిత్స పొందరు. మరోసారి తనకు కరోనా వైరస్ సోకినట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. రీఇన్ ఫెక్షన్ కు గురి కావడం ఆశ్చర్యంగా ఉందని రాంబాబు అన్నారు 

జులైలో తనకు కోవిడ్ వచ్చి తగ్గిన విషయం అందరికీ తెలిసిందేనని, నిన్న అసెంబ్లీలో కోవిడ్ టెస్టు చేయించుకున్నానని, పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ఆయన చెప్పారు. రీఇన్ ఫెక్షన్ కు గురి కావడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అవసరమైతే అస్పత్రిలో చేరుతానని చెప్పారు మరోసారి కరోనాను జయించి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్డునుడికి ఇటీవల రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ణారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.