అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారనంటేనే చంద్రబాబుకు ఏమీ చేతకాదని అర్థమని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. టీడీపీలో చంద్రబాబు ఓ విషసర్పంలా చేరారని ఆయన వ్యాఖ్యానించారు. 

సోమవారం జిరిగన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంతర్థాన దినోత్సవంలా జరిగిందని ఆయన అన్నారు. దివంగత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజున చంద్రబాబు కాంగ్రెసులో ఉన్నారని, కాంగ్రెసులో ఓడిపోయిన తర్వాతనే చంద్రబాబు టీడీపీలో చేరారని ఆయన గుర్తు చేశారు. 

వచ్చే శానససభ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకరని అంబటి రాంబాబు అన్నారు. ఎన్టీఆర్ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీకి ఈ గతి పట్టేది కాదని ఆయన వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. బిజెపికి ఎన్ని సీట్లు ఉన్నాయని, ఎక్కడ గెలిచాడని పవన్ కల్యాణ్ సీఎం అవుతారని ఆయన అడిగారు. 

రాష్ట్ర సంక్షేమం కోసమే ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని ఆయన అన్నారు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 132 శాతానికి పైగా అప్పులు చేశారని, చంద్రబాబు తన కార్యకర్తలకు డబ్బులు దోచిపెట్టారని ఆయన అన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూశారు కాబట్టే ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించి పెట్టారని ఆయన అన్నారు 

ప్రత్యేక హోదాపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, ప్రత్యేక హోదాపై తమ పార్టీ వెనక్కి తగ్గబోదని ఆయన అన్నారు. కేంద్రంపై వైసీపీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చేది కల్ల అని ఆయన అన్నారు చంద్రబాబు వస్తాడని ఎదురు చూసి కార్యకర్తలు మోసపోవద్దని ఆయన అన్నారు. 

అమరావతిని, పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో లక్షల కోట్లను టీడీపీ నేతలకు చంద్రబాబు దోచి పెట్టారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గుణం చంద్రబాబుదేనని, చంద్రబాబు అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అంబటి రాంబాబు అన్నారు.