ప్రభుత్వం నిర్ణయించిన మొత్తానికన్నా రూ. 5 కోట్లు ఎక్కువిచ్చి అంటే రూ. 27 కోట్లు చెల్లించి భూములను సొంతం చేసుకోమని కోర్టు ఆళ్ళకు చెప్పింది. దాంతో ఆళ్ళ ఈరోజు రూ. 10 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 17 కోట్లు చెల్లించాలి.

తాను చెప్పినట్లుగానే ఆళ్ళ కోర్టుకు మొదటి విడతగా రూ. 10 కోట్లు చెల్లించారు. సదావర్తి సత్రానికి సంబంధించి తమిళనాడులో ఉన్న 84 ఎకరాలకు రూ. 27 కోట్లు చెల్లించమని కోర్టు ఆదేశించింది. దానికి స్పందించిన వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గురువారం దేవాదాయశాఖ ఖాతాలో రూ. 10 కోట్లు కట్టారు. తమిళనాడులోని సదావర్తి భూములు ఆక్రమణల్లో ఉందని చంద్రబాబునాయుడు ప్రభుత్వం భావించింది. ఆక్రమణలను తొలగించటం కష్టమనకున్న చంద్రబాబు భూములను ఎవరికైనా అమ్మేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా రామానుజయ్య అనే వ్యక్తికి అమ్మేసారు.

సమస్యంతా ఇక్కడే మొదలైంది. ఇంతకీ ప్రభుత్వం వద్ద నుండి భూములు కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే చంద్రబాబుకు సన్నిహితుడు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్. అంటే వందల కోట్ల రూపాయలు విలువైన భూములను కేవలం రూ. 22 కోట్లకే దక్కించుకున్నారు. దాంతో ఆళ్ళ కోర్టులో కేసు వేయటం, తర్వాత జరిగిన పరిణామాలన్ని అందరికీ తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన మొత్తానికన్నా రూ. 5 కోట్లు ఎక్కువిచ్చి అంటే నాలుగు వారాల్లో రూ. 27 కోట్లు చెల్లించి భూములను సొంతం చేసుకోమని కోర్టు ఆళ్ళకు చెప్పింది. దాంతో ఆళ్ళ ఈరోజు రూ. 10 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 17 కోట్లు చెల్లించాలి.

కోర్టు ఆదేశాల తర్వాత మంత్రి నారా లోకేష్ పెద్ద కామిడినే చేసారు. కోర్టు చెప్పినట్లు ఆళ్ళ గనుక రూ. 27 కోట్లను చెల్లిస్తే ఐటి దాడులు చేయిస్తామని బెదిరించారు. లేకపోతే కేసులో ఓడిపోయినట్లు ఒప్పుకోవాలని ఆళ్ళకు చెప్పారు. అయితే, ఎంఎల్ఏ లోకేష్ ను ఏ దశలోనూ ఖాతరు చేయలేదనుకోండి అది వేరే సంగతి. తాను చెప్పినట్లు ఆళ్ళ డబ్బులైతే చెల్లిస్తున్నారు. మరి లోకేష్ బెదిరించినట్లుగా ఐటి దాడులు చేయిస్తారా?