Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, నారా లోకేష్ మధ్య విభేదాలు: ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్య

మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో టీడీపీ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు, నారా లోకేష్ కు మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

YCP Managalagiri MLA sees differences between Chandrababu and Nara Lokesh
Author
Mangalagiri, First Published Apr 3, 2021, 2:19 PM IST

మంగళగిరి: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడికి, ఆయన కుమారుడు నారా లోకేష్ కు మధ్య విభేదాలు ఉన్నట్లు అర్థమవుతోందని వైసీపీ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృ్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారని ఆయన గుర్తు చేస్తూ  మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ లో విచిత్ర పరిస్థితి నెలకొందని అన్నారు

చంద్రబాబు నాయుడు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెబితే.. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెబుతున్నారని ఆయన అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న లోకేష్ ఆదేశాలు లేకుండా ఇక్కడ నాయకులు ఎలా పోటీలో ఉన్నామని చెబుతారని ఆయన ప్రశ్నించారు. 

పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయం తీసుకునే ముందు తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ మాట్లాడుకోలేదా అని ఆళ్ల రామకృ్ణా రెడ్డి అడిగారు.  లేకుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ వ్యతిరేకిస్తున్నారా,  విషయాన్ని లోకేష్ స్పష్టం చేయాలని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో అందరికీ ఒక న్యాయం లోకేష్ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులకు ఒక న్యాయమా అని ఆయన అడిగారు. దుగ్గిరాల మండలం లో తెలుగుదేశం నాయకులు పార్టీ కార్యకర్తలు, అభిమానులు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారని అంటూ అలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు, లోకేష్ కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నారా అని అడిగారు.  తీసుకొని ఉంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని లోకేష్ ఎలా వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.

ఇవాళ దుగ్గిరాల మండలం లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ చేసే విధానాన్ని బట్టి చంద్రబాబు లోకేష్ మధ్య విభేదాలు ఉన్నాయని అర్థమవుతుందని అన్నారు. దుగ్గిరాల మండలం లో పోటీ చేస్తానంటే భయపడే వాళ్ళు ఎవరూ లేరని ఆయన అన్నారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 18 పంచాయతీలో లో లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 14 గెలుచుకుంటే తెలుగుదేశం మద్దతు ధర కేవలం రెండు మాత్రమే గెలుచుకున్నారని ఆళ్ల చెప్పారు.

చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ దుగ్గిరాల లో పోటీ చేస్తున్నారని అన్నారు.  దుగ్గిరాలలో ఉన్న పసుపు వ్యాపారులంతా వాళ్ళవాళ్లేనని, వ్యాపారం అడ్డంపెట్టుకుని కోట్లాది రూపాయల గుమ్మరించి బెదిరించి దుగ్గిరాలలో గెలుపొందాలని లోకేష్ భావిస్తున్నారని ఆయన అన్నారు. లోకేష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా 18 ఎంపిటిసి స్థానాలకు 17 స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుగ్గిరాల జడ్పిటిసి స్థానానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆర్కే అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios