స్పీకర్ కోడెలకు వైసీపీ బహిరంగ లేఖ

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 5, Sep 2018, 4:39 PM IST
ycp letter to ap assembly speaker kodela
Highlights

ఈ విషయంపై స్పీకర్‌ కోడెలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు

పార్టీ ఫిరాయింపు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ నేతలు మరోసారి డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ కి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలను కొనగోలు చేశారని ఆరోపించారు.

పార్టీ మారిన వారిని మంత్రులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఈ విషయంపై స్పీకర్‌ కోడెలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.  స్పీకర్‌గా ఉంటూ కోడెల టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. స్పీకర్‌ స్థానాన్ని అవమానపరిచేలా కోడెల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే రేపు ఉదయాన్నే సభకు హాజరవుతామని పేర్కొన్నారు.

loader