Asianet News TeluguAsianet News Telugu

పెగాసెస్‌ ఎవరి కోసం ఉపయోగించారు: చంద్రబాబుపై విచారణకు అసెంబ్లీలో వైసీపీ డిమాండ్


పెగాసెస్ సాఫ్ట్‌వేర్  అంశంపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను కొనుగోలు చేశారని మమత బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో ఇవాళ ఏపీ అసెంబ్లీలో ఈ విషయమై చర్చ జరిగింది. 
 

YCP legislators Demanding to probe on Chandrababu Government Used pegasus  software
Author
Guntur, First Published Mar 21, 2022, 2:58 PM IST

అమరావతి:పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను చంద్రబాబునాయుడు ఎవరి కోసం ఉపయోగించారో తేలాల్సిన అవసరం ఉందని వైసీపీ  ఎమ్మెల్యే అంబటి  రాంబాబు చెప్పారు. ఈ విషయమై విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.

Pegasus అంశంపై సోమవారం నాడు Andhra Pradesh Assembly లో చర్చ జరిగింది. పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ను Chandrababu కొనుగోలు చేసి ఎవరిపై ఉపయోగించారో తేలాల్సిన అవసరం ఉందన్నారు. 

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్ ను కొనుగోలు చేసిందని West Bengal సీఎం Mamata Benarjee అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఈ సాఫ్ట్ వేర్ కొనుగోలు అంశానికి సంబంధించి చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. 

మమత బెనర్జీ ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే ఈ సాఫ్ట్ వేర్ కొనుగోలుకు తమకు సంబధం లేదని  ఆనాడు మంత్రివర్గంలో ఉన్న వారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు చెప్పారు. అబద్దాలు ఆడాల్సిన అవసరం మమత బెనర్జీకి ఉంటుందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.ఒకరి కోసం అబద్దాలు ఆడాల్సిన అవసరం మమత బెనర్జీకి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు హయంలోని ఓ ఇంటలిజెన్స్ చీఫ్  పోలీస్ అధికారిలా వ్యవహరించలేదని అంబటి రాంబాబు చెప్పారు.పచ్చ చొక్కా వేసుకొన్న  టీడీపీ నేత మాదిరిగా వ్యవహరించారని అంబటి రాంబాబు చెప్పారు. వైసీపీ నేతలందరి ఫోన్లను చంద్రబాబు ట్యాప్ చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు.  మిత్రపక్షమైన బీజేపీ నేతలపై కూడా పెగాసెస్ ను చంద్రబాబు ఉపయోగించారని అంబటి రాంబాబు విమర్శించారు. 

ప్రత్యర్ధి పార్టీని భూ స్థాపితం చేయాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు  ప్లాన్ గా  అంబటి రాంబాబు చెప్పారు. జగన్ టీమ్ ను చిందర వందర చేయాలనేది చంద్రబాబు లక్ష్యమని Ambati Rambabu  చెప్పారు. అందుకే చంద్రబాబు పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని అంబటి రాంబాబు చెప్పారు. 

కుట్రలు, కుతంత్రాలు చేయడమే చంద్రబాబు ప్లాన్ అని అంబటి రాంబాబు చెప్పారు.పెగాసెస్ అంశంపై విచారణ చేయాల్సి న అవసరం ఉందని అంబటి రాంబాబు చెప్పారు. వెంటనే  ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారన్నారు.  

ఈ విషయమై చంద్రబాబు  తెలంగాణ సీఎం కేసీఆర్ తో కూడా కొట్లాడారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. పక్క రాష్ట్రం నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేసేందుకు బాబు పెగాసెస్ ను ఉపయోగించారేమోనని రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు అనైతికంగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios