విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు వజ్ర భాస్కర్‌ రెడ్డి, కాసు విజయభాస్కర్‌ రెడ్డి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని ఈ సందర్భంగా కన్నా లక్ష్మినారాయణ మీడియాతో అన్నారు. 

మోడీపై విశ్వాసంతో బీజేపీలో చేరడానికి అన్ని పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారని, అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.