వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే సహకరించను: వైసీపీ నేత దుట్టా రామచంద్రారావు

వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ టికెట్ ను  వల్లభనేని వంశీకి ఇస్తే తాను మాత్రం వంశీ గెలుపు కోసం పనిచేయబోనని దుట్టా రామచంద్రారావు తేల్చి చెప్పారు. వంశీ తనను అవమానాలకు గురి చేశాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో భూసేకరణలో అక్రమాలపై విచారణ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
 

YCP Leader Dutta Ramachandra Rao Reacts On Gannavaram MLA Vallabhaneni Vamsi Comments

గన్నవరం:వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ టికెట్ ను వల్లభనేని వంశీకి ఇస్తే  తాను మాత్రం వంశీ గెలుపు కోసం పని చేయనని  వైసీపీ నేత Dutta Ramachandra Raoచెప్పారు.Gannavram ఎమ్మెల్యే Vallabhaneni Vamsi చేసిన వ్యాఖ్యలపై దుట్టా రామచంద్రారావు స్నందించారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు వల్లభనేని వంశీతో విబేధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. TDP నుండి YCP లో వంశీ చేరిన తర్వాత తన ఇంటికి వస్తానని వంశీ పదే పదే తనకు ఫోన్ చేశాడని చెప్పారు. కానీ YS Jagan ఆదేశాలు వచ్చే వరకు తన ఇంటికి రావొద్దని తాను వంశీకి చెప్పానన్నారు. జగన్ చెప్పిన తర్వాతే వంశీ తన ఇంటికి వచ్చినట్టుగా దుట్టా రామచంద్రారావు చెప్పారు. వల్లభనేని వంశీ పదే పదే తనను అవమానాలకు గురి చేశాడని ఆయన చెప్పారు.ఈ అవమానాలు భరించలేదకపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వంశీకి పార్టీ నాయకత్వం టికెట్ ఇచ్చినా కూడా తాను ఈ అవమానాలను దృష్టిలో ఉంచుకొని సహకరించబోనని దుట్టా రామచంద్రారావు తేల్చి చెప్పారు.

ఉంగుటూరు ZPTC  స్థానం నుండి తన కూతురు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో ఎమ్మెల్యే వల్లభనేని  వంశీ పాత్ర లేదని  చెప్పారు. ఉంగుటూరుకు చెందిన రాము అనే వైసీపీ నేత పాత్ర ఉందని చెప్పారు.  తనకు ఏదైనా పదవి కావాలంటే పార్టీ నాయకత్వాన్ని అడుగుతానన్నారు. కానీ వంశీ సిఫారసు తనకు అవసరం లేదన్నారు. బాపులపాడు మండలంలో ఇళ్ల స్థలాల సేకరణ విషయంలో అవకతవకలపై  విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఒక్క మండలంలోనే కాదు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఇళ్ల స్థలాల సేకరణపై విచారణ నిర్వహించాలని దుట్టా రామచంద్రారావు డిమాండ్ చేశారు.ఈ విచారణలో వాస్తవాలు తేలుతాయన్నారు.సిట్టింగ్ జడ్జి లేదా కలెక్టర్ తో Probe చేయించాలని ఆయన కోరారు. కేసరిపల్లిలో కూడా విచారణ చేయాలని కోరారు.

తనకు ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం లేదని దుట్టా రామచంద్రారావు చెప్పారు. తాను మనుషుల డాక్టర్ ను అని ఆయనచెప్పారు. 40 ఏళ్లుగా తాను మనుషులకు మాత్రమే వైద్యం చేశానని చెప్పారు. జంతువులకు మాత్రం వైద్యం చేయలేదన్నారు. 

also read:Vallabhaneni Vamsi: వైసీపీలో ముదురుతున్న‌ అధిప‌త్య పోరు.. యార్లగడ్డకు వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్‌

రెండు రోజుల క్రితం యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలపై వల్లభనేని వంశీ స్పందించారు. . 2019 గన్నవరం అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓ విలన్‌పై పోటీ చేసి ఓడిపోయానని అతడిని పార్టీలోకి తీసుకోవడాన్ని కూడా తాను వ్యతిరేకించినట్లు యార్లగడ్డ వెంకట్రావు ఈ నెల 10న వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈ నెల 11న  వంశీ  స్పందించారు. తాను విలనో, హీరోనో గన్నవరం ప్రజలకు తెలుసునన్నారు. జగన్‌మోహన్ రెడ్డికి మద్దతు తెలపడంతో ఆయన తనకి గన్నవరం బాధ్యతలు అప్పగించారని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు.

ఈ విషయమై ఏదైనా ఇబ్బంది ఉంటే అధిష్టానానికి చెప్పుకోవాలన్నారు. ఇంకా ఇబ్బందులుంటే నేరుగా జగన్ దగ్గరికి వెళ్లొచ్చని యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుని ఉద్దేశిస్తూ వంశీ వ్యాఖ్యానించారు.. జస్టిస్ చౌదరిలుగా రోడుపై వెళ్లే ప్రతివాడూ కామెంట్స్ చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios