చంద్రబాబు ఏటూకాని వ్యక్తి అన్న విజయసాయి రెడ్డి

First Published 19, Jul 2018, 4:32 PM IST
ycp leader vijayasai reddy sensational comments on chandrababu
Highlights

 చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని, ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి అని విమర్శించారు. 

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏటూకాని వ్యక్తి అంటూ.. తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని, ప్రకృతిలో ఆయన ఎటూకాని వ్యక్తి అని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మారుస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఓవైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ అవిశ్వాసం పెట్టినప్పుడు దానివల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని అదే పని చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా కోరుకుంటోందని, ఏపీకి న్యాయం జరిగేందుకు ఏ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని గతంలోనే చెప్పామని గుర్తుచేశారు.

ఇదిలా ఉండగా .. విజయసాయిరెడ్డి చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

loader