Asianet News TeluguAsianet News Telugu

పంచభూతాలను దోచుకుతిన్నా, కొడుకు కోసం కృష్ణానదిని పూడ్చేస్తావా: చంద్రబాబుపై వైసీపీ నేత ఫైర్

రాష్ట్రాన్ని దోచుకుతినడానికి చంద్రబాబుకు పర్మిషన్‌ ఎవరిచ్చారంటూ విరుచుకుపడ్డారు. రాజధానిలో దాదాపు 2 వేల కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని కాజేస్తుంటే చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. తన కుమారుడి కోసం చంద్రబాబు ఏకంగా కృష్ణా నది రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

ycp leader nandigam suresh fires on chandrababu
Author
Vijayawada, First Published May 4, 2019, 5:28 PM IST

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ నిప్పులు చెరిగారు. పంచభూతాలను దోచుకుతిన్న ఏకైక వ్యక్తి చంద్రబాబేనంటూ విరుచుకుపడ్డారు. 

శనివారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలో సర్వం దోచేసుకున్నారంటూ విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతంలో కృష్ణానదిని అక్రమంగా పూడ్చుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

చుక్కపల్లి ప్రసాద్, కుశలవ సత్యప్రసాద్ అనే ఇద్దరు వ్యక్తుల నేతృత్వంలో కృష్ణానదిని పూడ్చడం జరుగుతుందని మండిపడ్డారు. ఇప్పటి వరకూ అమరావతిలో అమరావతిలో ఆలయ భూములను, కృష్ణా నది ఇసుకను దోచుకున్నారని ప్రస్తుతం చంద్రబాబు డైరెక్షన్లో ఏకంగా నదినే పూడ్చేస్తున్నారని సురేష్ ఆరోపించారు. 

రాష్ట్రాన్ని దోచుకుతినడానికి చంద్రబాబుకు పర్మిషన్‌ ఎవరిచ్చారంటూ విరుచుకుపడ్డారు. రాజధానిలో దాదాపు 2 వేల కోట్ల విలువైన 150 ఎకరాల భూమిని కాజేస్తుంటే చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. 

తన కుమారుడి కోసం చంద్రబాబు ఏకంగా కృష్ణా నది రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కృష్ణానదిని పూడ్చడం ఆపాలని లేకపోతే తామే అడ్డుకుంటామంటూ మండిపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios