రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత కన్నుమూసిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. యానం నుంచి కోటిపల్లి వెళుతున్న కారు కే. గంగవరం మండలం, పాతకోట డ్యామ్ దగ్గర అదుపు తప్పి డ్యామ్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో  వైసీపీనేత ఒకరు మృతి చెందారు. గత అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. అయితే కారు నీటిలో ఉండడంతో బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. 

చనిపోయిన వ్యక్తి ముమ్మడివరం మండలం, సి. కొత్తపల్లికి చెందిన ముదునూరి వినోద్ వర్మగా గుర్తించారు. ఇతను వైసీపీ నేత. నిన్న జగన్ ప్రమాణస్వీకారినికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వినోద్ వర్మ మృతి చెందిన వార్త తెలియగానే ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిన్న జగన్ ప్రమాణస్వీకారానికి వచ్చారని, తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.