Asianet News TeluguAsianet News Telugu

జగన్ షాకింగ్ నిర్ణయం.. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా

టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గత శాసనమండలి సమావేశాలకు ముందే పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లుపై శాసన మండలిలో ఓటింగ్ జరిగినప్పుడు ఓటును కూడా వినియోగించుకోలేదు.

YCP Leader Dokka Manikya Vara Prasad in race for MLC
Author
Hyderabad, First Published Jun 25, 2020, 8:04 AM IST

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చిన డొక్కా మాణిక్య వరప్రసాద్ ని తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు. గురువారం ఉదయం డొక్కా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనను ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేల సంతకాలతో సహా నామినేషన్ ప్రక్రియకు వైసీపీ ఏర్పాట్లు చేసింది.

తెలుగు దేశం పార్టీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడంతో ఏర్పడిన స్థానాన్ని బర్తి చేయాలని నిర్ణయించారు.టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గత శాసనమండలి సమావేశాలకు ముందే పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. మూడు రాజధానుల బిల్లుపై శాసన మండలిలో ఓటింగ్ జరిగినప్పుడు ఓటును కూడా వినియోగించుకోలేదు.

ఆ తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానానికి నోటిఫికేషన్ ఇవ్వగా.. గురువారంతో ఎన్నికకు గడువు ముగియనుంది. దీంతో ఆ పదవికి వైసీపీ నుంచి డొక్కాను ఎంపిక చేశారు. గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా.. టీడీపీ నుంచి ఎవరూ నామినేషన్ వేయడం లేదని తెలుస్తోంది. దీంతో.. డొక్కా ఎంపిక ఏకగ్రీవం కానుంది. ఇదిలా ఉండగా.. కాగా, 2019 సాధారణ ఎన్నికల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుత హోం మంత్రి మేకతోటి సుచరితపై ఆయన ఓడిపోయారు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు డొక్కాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీ మారినా.. మళ్లీ ఎమ్మెల్సీ గా ఆయననే ఎంపిక చేయడం గమనార్హం.


 

Follow Us:
Download App:
  • android
  • ios