Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు మోసం చేస్తారని ముందు నుంచే.. దేవినేని అవినాష్

గతంలోనూ చంద్రబాబుపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను భ్రష్టు పట్టించాలనే టిడిపి నేతలు, కార్యకర్తల ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 13 జిల్లాలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారని తెలిపారు.

ycp leader devineni Avinash shocking comments on Chandrababu
Author
Hyderabad, First Published Dec 9, 2019, 7:34 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేత దేవినేని అవినాష్ సంచలన కామెంట్స్ చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా తన రాజకీయ భవిష్యత్‌ కోసం పార్థసారధి ఎన్నో సూచనలు చేసేవారని వైసీపీ నేత దేవినేని అవినాష్‌ అన్నారు. 

చంద్రబాబు మోసం చేస్తారని ముందు నుంచి పార్థసారధి హెచ్చరిస్తూ ఉండేవారని దేవినేని అవినాష్‌ వెల్లడించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తామని, పెనమలూరు నియోజకవర్గాన్ని బోడె ప్రసాద్‌ పట్టించుకోలేదని విమర్శించారు. నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని అవినాష్‌ స్పష్టం చేశారు.

కాగా... అవినాష్.. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.... గతంలోనూ చంద్రబాబుపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ను భ్రష్టు పట్టించాలనే టిడిపి నేతలు, కార్యకర్తల ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 13 జిల్లాలో చంద్రబాబు చేపడుతున్న కార్యకర్తల సమావేశాలలో ప్రతి ఒక్క కార్యకర్త చంద్రబాబును నిలదీస్తున్నారని తెలిపారు. 

గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేసిన వారికి కనీసం బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. అమరావతిలో భాగమైన మంగళగిరిని అభివృద్దిని టిడిపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదన్నారు. 

గతంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులే ఇప్పుడు చంద్రబాబును నిలదీస్తున్నారని అన్నారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య, జాతీయ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 365 రోజులు పని కల్పిస్తానని ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. 

రాజధానికి శంకుస్థాపన స్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని నిలదీశారు. బహిరంగ సభలలో మోదీ మట్టి, నీళ్లు తప్ప మనకి ఏమి ఇవ్వలేదు అని చెప్పిన మాటలు వాస్తవం కాదా అని అడిగారు. టిడిపి నేతలు పెయిడ్ ఆర్టిస్టులతో ఈరోజు రాజధానిలో హడావుడి చేశారని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios