అవినీతిని ప్రశ్నిస్తానంటూ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఏపీసీఎం చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించడం లేదని వైసీపీనేత సీ.రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం ఆయన కడప లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

అధికార పార్టీ వైఫల్యాలు చెప్పకుండా ప్రతిపక్ష పార్టీని ఎలా విమర్శిస్తారన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అధికారపార్టీ వైఫల్యంపై పవన్ ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. చంద్రబాబు-పవన్ చీకటి ఒప్పందం చేసుకున్నారని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.

చంద్రబాబు-పవన్ లకు మధ్యవర్తిగా లింగమనేని రమేష్ పనిచేస్తున్నారని చెప్పారు.  2014 కావాలనే పవన్ ఎన్నికల్లో పోటీ చేయలేదని.. ఇప్పుడు ఒప్పందంతో పోటీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందంటున్న పవన్‌.. కేసీఆర్‌ ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. 

చంద్రబాబు కుట్రలు, అవినీతి అన్ని పవన్‌కు తెలుసనని, అయినప్పటికీ అతను ప్రశ్నించడం లేదని విమర్శించారు.  మరోసారి మోసం చంద్రబాబు, పవన్‌లు కుట్ర చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.