సుధాకర్ ది ఆత్మహత్య కాదు, చంద్రబాబు సర్కార్ చేయించిన హత్య : భూమన

ycp leader bhumana karunakar reddy reacts on sudhakar suicide
Highlights

ప్రత్యేక హోదా కోసం చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ చేనేత కార్మికుడు ఇవాళ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతడిది ఆత్మహత్య కాదని, చంద్రబాబు ప్రభుత్వం చేయించిన హత్యే అని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం యువ చేనేత కార్మకుడు బలవన్మరనానికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరి వల్ల రాష్ట్ర ప్రజలు బలవుతున్నారని భూమన మండిపడ్డారు.

ప్రత్యేక హోదా అనేది ఉద్యమం రూపం నుండి సెంటిమెంట్ రూపంలోకి మారిందని అన్నారు. ఇలాంటి సమయంలో టిడిపి ఎంపీలు దొంగనాటకాలు ఆడటం మానుకోవాలని, చిత్తశుద్దితో ఉద్యమించాలని భూమన సూచించారు.   

ప్రత్యేక హోదా కోసం ఇకపై ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని, అందరం కలిసి పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని అన్నారు. ప్రత్యేక హోదా మన హక్కు దాన్ని సాధించుకునే వరకు విశ్రమించవద్దని భూమన ప్రజలకు సూచించారు. ఇంతకు మునుపే హోదా కోసం బలిదానాలు చేసుకోవద్దని తమ అధినేత జగన్ సూచించారని భూమన గుర్తు చేశారు. 
 
loader