శ్రీలంకలో బాంబు పేలుళ్లు మారణ హోమం సృష్టించాయి. ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల థాటికి 300మందికి పైగా కన్నుమూశారు. ఈ ఘటనలో పదది మందికి పైగా భారతీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పలువురు.. భారతీయులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.

కాగా..ఈ పేలుళ్ల థాటి నుంచి వైసీపీ నేత అమర్ నాథ్.. ప్రాణాలతో బయటపడ్డారు. ఈ పేలుళ్లు సంభవించిన సమయంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్‌నాథ్ శ్రీలంకలోనే ఉన్నారు. బాంబు పేలుళ్ల నుంచి అమర్‌నాథ్, ఆయన స్నేహితులు తృటిలో తప్పించుకున్నారు. ఎన్నికల అనంతరం స్నేహితులతో కలిసి అమర్ శ్రీలంకకు వెళ్లారు. అమరనాథ్ బసచేసిన కింగ్స్‌జ్యూరీ హోటల్‌కు అతి సమీపంలో బాంబులు పేలాయి. అప్రమత్తమైన అమర్, ఆయన స్నేహితులు తృటిలో తప్పించుకున్నారు. 

అనంతరం స్నేహితులతో కలిసి సురక్షితంగా అమర్.. విశాఖ చేరుకున్నారు. అమర్‌తో పాటు శ్రీలంకకు వెళ్లిన వారిలో వైసీపీ నేత శ్రీకాంత్ రాజు కూడా ఉన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన అమర్.. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానమే తమను ఈ ఘటన నుంచి రక్షించాయన్నారు.