వైసీపీకి మరో పరాభవం తప్పదు. కాకినాడ లో కూడా టీడీపీనే గెలుస్తుందన్న ప్రతిపాటీ. సింగిల్ డిజిట్ మించి రాదన్న ప్రతిపాటీ.

నంద్యాల గెలుపు టీడీపీ నేతల్లో రెట్టించిన ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే జోరు కాకినాడ‌లో పోలింగ్ లో కూడా క‌న‌బ‌డింది. కార‌ణం కాకినాడ ఎన్నిక‌లకు ముందు రోజు నంద్యాల ఫ‌లితం రావ‌డంతో..అప్ప‌టి నుండి టీడీపీ నేత‌లు రెచ్చిపోతున్నారు. మ‌ళ్లీ కాకినాడ‌లో కూడా నంద్యాల ఫ‌లితం రిపీట్ అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు టీడీపీ నేత‌లు

వైసీపీకి కాకినాడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని జోస్యం చెప్పారు మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు. ఆ పార్టీకి సింగిల్ డిజిట్ ని మించి గెలుచుకోలేద‌న్నారు. 20 ఏళ్ల తరువాత కాకినాడలో టీడీపీ జెండా ఎగరబోతోందన్నారు. టీడీపీ చేసిన అభివృద్ది ప‌నుల కారణంగానే విజ‌యాలు సాధ్య‌మ‌వుతుంద‌ని ఆయ‌న మీడియాతో తెలిపారు


నంద్యాల్లో టీడీపీ గెలుపు త‌మ పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంచింద‌న్నారు ప్ర‌త్తిపాటి. కాకినాడలో 40 స్థానాల్లో టీడీపీ, బీజేపీ కూటమి గెలుస్తుందని ఆయ‌న పెర్కోన్నారు. కాకినాడ ఎన్నికలు కూడా వైసీపీకి గుణపాఠం నేర్పుతాయని మంత్రి తెలిపారు. వైసీపీ పార్టీని న‌మ్మి ఓటేసే స్థితిలో ప్ర‌జ‌లు లేర‌ని ఆయ‌న విమ‌ర్శించారు.