ఓ హత్య కేసులో వైసీపీ నాయకుడికి సుప్రీంకోర్టు జీవితఖైదు విధించింది. 2007లో జరిగిన ఓ హత్య కేసులో సోమవారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆయనతో పాటు మరో ఇద్దరికీ ఇదే శిక్షను ఖరారు చేసింది. 

కర్నూలు : వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికి చెందిన రాజ శేఖర్ రెడ్డి హత్య కేసులో దాయాది సోదరులు కాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, కాసిరెడ్డి రామకృష్ణారెడ్డి, కాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి (కర్నూలు 42వ వార్డు YCP Corporator)కు Life imprisonment విధిస్తూ Supreme Court సోమవారం తీర్పు వెలువరించింది. హత్యకేసులో ముగ్గురు ప్రధాన నిందితులకు Trial court విధించిన యావజ్జీవ శిక్షను సుప్రీం కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో సాక్షులు హతుడికి బంధువులు, సన్నిహితులు కావడంతో వారి సాక్షాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి వీలు లేదంటూ నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ 2018 ఫిబ్రవరి 21న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.

2007 జనవరి 18న రాత్రి 8:30 సమయంలో 11 మంది వ్యక్తులు రాజశేఖర్ రెడ్డి, అతని సోదరుడు ఎం. నాగేశ్వర్ రెడ్డి, మరో నలుగురు వ్యక్తులు కలిసి వెళుతున్న సూమో వాహనాన్ని వెంబడించారు. దాడిలో రాజశేఖర్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా, గాయపడిన ఇద్దర్నీ కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు విచారణ చేపట్టిన కర్నూలు డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి సాక్ష్యాధారాల ప్రకారం ముగ్గురు ప్రధాన నిందితులు కాసిరెడ్డి రామకృష్ణారెడ్డి, కాసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, కాసిరెడ్డి రాంభూపాల్ రెడ్డికి ipc section 148, 302 కింద యావజ్జీవ శిక్ష విధించారు.

నాలుగు నుంచి 11వ నెంబర్ వరకు ఉన్న నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. ఈ తీర్పునకు వ్యతిరేకంగా శిక్ష పడ్డ ముగ్గురు హై కోర్టుకు అప్పీలుకు వెళ్లగా కోర్టు వారికి అనుకూలంగా తీర్పునిస్తూ ముగ్గురినీ నిర్దోషులుగా విడుదల చేసింది. దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు బాధితులు బాధితులు సుప్రీం బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తీర్పు సమయంలో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. 

ఇదిలా ఉండగా, నిన్న అసెంబ్లీ సమావేశాల మీద జరిగిన బీఏసీ భేటీలో సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ‘రాజ్యాంగ హోదాలో ఉన్నGovernorను అవమానిస్తారా? ఇదేం పద్దతి.. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా కాగితాలు చించేసి ఆయనపై విసరడం ఏంటి?’ అని ముఖ్యమంత్రి YS Jagan టిడిపి సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా మండలి (BAC) సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ సమావేశానికి హాజరైన TDP పక్ష ఉపనేత Kinjarapu Atchannaiduను ప్రశ్నించారు. ‘చరిత్రలో ఎప్పుడూ ఇలాంటివి లేవు. మీ సభ్యుల తీరు Assembly పవిత్రతను నాశనం చేసేలా ఉంది’ అని సీఎం అన్నారు. 

‘గతంలో మీరూ చేశారు’ కదా అని అచ్చన్నాయుడు వ్యాఖ్యానించగా.. ‘నేను చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. మంత్రి మండలి రద్దు చేసుకుంటా’ అని సీఎం తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలిసింది. ‘గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది ఇది మొదటి సారి కాదు కదా’ అని అచ్చెన్నాయుడు అనగా… ‘ మేము ఎప్పుడూ ఇలా చేయలేదు. చేశాను అని చూపిస్తే రాజీనామా చేస్తా’ అని సీఎం పునరుద్ఘాటించారు . ‘మీరు చేశారని కాదు.. ఇలా గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది గతంలోనూ జరిగాయి.. అనేది నా ఉద్దేశ్యం’ అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.