వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి చేరుకున్న ఆయనకు అభమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి చేరుకున్న ఆయనకు అభమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ప్రధాని నరేంద్రమోడీ నివాసానికి బయలుదేరి జగన్.. ప్రధానితో భేటీ అవుతారు.
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని జగన్.. మోడీకి విజ్ఞప్తి చేయనున్నారు. ఆయన వెంట ఏపీ సీఎస్, ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, నందిగం సురేశ్ ఉన్నారు.
