నంద్యాల ఉపఎన్నికల ప్రచారం చివరిరోజున శిల్పా కుటుంబం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి సవాలు విసిరింది. చంద్రబాబునాయుడు, మంత్రి అఖిలప్రియ తనపై చేసిన దుష్ర్పాచారాన్ని ఖండించారు. తానేరోజూ అక్రమాలకు పాల్పడలేదన్నారు. తమ కుటుంబం నిర్వహిస్తున్న శిల్పా సేవాసమితిలో అక్రమాలు జరుగుతున్నట్లు చంద్రబాబు చేసిన అరోపణలపై మండిపడ్డారు.
నంద్యాల ఉపఎన్నికల ప్రచారం చివరిరోజున శిల్పా కుటుంబం చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి సవాలు విసిరింది. సోమవారం ఉదయం వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రచారం సందర్భంగా చంద్రబాబునాయుడు, మంత్రి అఖిలప్రియ తనపై చేసిన దుష్ర్పాచారాన్ని ఖండించారు. తానేరోజూ అక్రమాలకు పాల్పడలేదన్నారు.
తమ కుటుంబం నిర్వహిస్తున్న శిల్పా సేవాసమితిలో అక్రమాలు జరుగుతున్నట్లు చంద్రబాబు చేసిన అరోపణలపై మండిపడ్డారు. తాము నిర్వహిస్తున్న సేవాసమితి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి విచారణైనా జరిపించుకోవచ్చని సవాలు విసిరారు.
నాలుగు మాసాల క్రితం వరకూ తనను, తమ సేవాసమితిని ఎన్నోమార్లు ప్రశంసించిన చంద్రబాబుకు తాను వైసీపీలో చేరగానే తాను అక్రమార్కుడిని అయిపోయానా? అంటూ నిలదీసారు. నియోజకవర్గంలో అభివృద్ధికి తాను చంద్రబాబును ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసిన ‘నిధులేమన్నా చెట్లకు కాస్తున్నాయా’ అంటూ ప్రశ్నించటం అందరికీ తెలిసిందేనన్నారు.
తాము నిర్వహిస్తున్న మహిళా బ్యాంకులో అధిక వడ్డీ తీసుకుంటున్నామని, అక్రమాలు చేస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. తాము నడుపుతున్న సహకార బ్యాంకు నష్టాల్లో ఉన్నా ఇంకా నడుపుతున్నామంటే కేవలం సేవాభావం ఉండబట్టేనని స్పష్టం చేసారు.
ఉపఎన్నికలో గెలువమన్న విషయం అర్ధమైపోయిందని అందుకే తన వ్యక్తిత్వంపై బురద చల్లుతున్నట్లు మండిపడ్దారు. నియోజకవర్గంలో ఇంతకాలం అరాచకాలకు పాల్పడిన భూమా కుటుంబమే ఎన్నికల్లో తనపై ఎదురు దాడులు చేయటం విచిత్రంగా ఉందన్నారు. కేవలం ఉపఎన్నికల్లో తనను ఇబ్బందులకు గురిచేయటం కోసమే తమ బంధువుల ఇళ్ళపై పోలీసులతో దాడులు చేయించినట్లు ధ్వజమెత్తారు.
ఇన్నిరోజులు చంద్రబాబు, అఖిలప్రియలు చేసిన ఆరోపణలకు ఈరోజు శిల్పా కుటుంబం సమాధానం చెప్పింది. కాబట్టి శిల్పా కుటుంబం చేసిన ఆరోపణలకు చంద్రబాబు, అఖిలే సమాధానం చెప్పుకోవాలి. మరి, సమాధానం చెబుతారా?
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
