వైసిపికి 150 సీట్లు ఖాయం

First Published 4, Apr 2018, 3:24 PM IST
Ycp bags 150 seats in coming elections
Highlights
చంద్రబాబునాయుడు అధికారాంతంలో ఉన్న విషయం తెలిసిపోతోందన్నారు.

రానున్న ఎన్నికల్లో వైసిపికి 150 సీట్లు ఖాయమా? ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెబుతున్న లెక్కల ప్రకారం ఖాయమేనట. బుధవారం ఎంపి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు అధికారాంతంలో ఉన్న విషయం తెలిసిపోతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకావమే లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఇంతకాలం కమ్యూనిస్టులు, పవన్, బిజెపిలను తన సైకిల్ కు చక్రాలలాగ చంద్రబాబు వాడుకున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆ చక్రాలన్నీ విడిపోతే కొత్త టైర్ల కోసం వెతుకునేందుకు ఢిల్లీకి వచ్చారట. ఎక్కడ యు టర్న్ కనిపించినా తనకు చంద్రబాబే గుర్తుకువస్తున్నట్లు చెప్పారు.

loader