Asianet News TeluguAsianet News Telugu

యాత్ర, కథానాయకుడు సినిమాలు బాగున్నాయి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి పదవి నియమనిబంధనలు ఇబ్బందిగా ఉన్నా పాటించక తప్పదని చెప్పారు. విద్య, రీసెర్చ్, వ్యవసాయం, సంస్కృతి, సేవ రంగాల్లో రాణించేవారిని ప్రోత్సహిస్తూ తన వంతు కృషి చేస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 

yatra, kathanayakudu movies good says vice president venkaiah naidu
Author
Nellore, First Published Feb 23, 2019, 11:15 AM IST

నెల్లూరు: దివంగత సీఎం ఎన్టీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చాలా బాగుందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అలాగే దివంగత సీఎం వైఎస్ఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా కూడా చూశానని ఎంతో బాగుందన్నారు. 

నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజకీయపార్టీలు మాతృబాష పరిరక్షణకి ఏం చేస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మాతృభాష పరిరక్షణ కోసం ఏం చేస్తాయో మేనిఫెస్టోల్లో పెట్టేలా ఆయా పార్టీలపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. 

ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరమని చెప్పుకొచ్చారు. దేశభక్తి అంటే ఎవరి పని వారు చేసుకోవడమే అని స్పష్టం చేశారు. జనం మధ్యలో ఉండటం, వారి కోసం పనిచేయడం తనకు ఇష్టమన్నారు. 

అయితే ఉపరాష్ట్రపతి పదవి నియమనిబంధనలు ఇబ్బందిగా ఉన్నా పాటించక తప్పదని చెప్పారు. విద్య, రీసెర్చ్, వ్యవసాయం, సంస్కృతి, సేవ రంగాల్లో రాణించేవారిని ప్రోత్సహిస్తూ తన వంతు కృషి చేస్తున్నానని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios