మోడీని చూసి భయపడేది బాబు కాదు.. జగన్

yanamala ramakrishnudu fires on bjp
Highlights

వైసీపీ, జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా చేస్తున్న విమర్శలపై స్పందించారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.

మోడీని చూసి చంద్రబాబు భయపడుతున్నారంటూ గత కొద్దిరోజులుగా వస్తున్న కామెంట్లపై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు... మోడీని చూసి చంద్రబాబు భయపడుతున్నారంటూ చేస్తోన్న విమర్శలు పెద్ద జోక్ అన్నారు. అసలు 12 ఛార్జీషీట్లలో నిందితుడైన జగనే మోడీని చూసి భయపడాలని విమర్శించారు.

ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం వైసీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల గేమ్ ప్లాన్ లో భాగమన్నారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు రాజీనామా చేయాలని యనమల ప్రశ్నించారు. టీడీపీని ఎలా ఓడించాలా అనే జగన్, పవన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని మంత్రి ఆరోపించారు.

loader