నిరుద్యోగ భృతి ఎన్నికల హామీ అమలుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం

2017-18 సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఇది అమరావతి నుంచి ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్.

అంతేకాదు,ఆయన తెలుగు భాషలో చేసిన తొలి బడ్జెట్ ప్రసంగం కూడా ఇదే.ఆర్థిక మంత్రిగా యనమలకు ఇది తొమ్మిదో బడ్జెట్.

నిరుద్యోగ భృతి

ఈ బడ్జెట్ లో కొత్త అంశం నిరుద్యోగ భృతి. అయితే, దీనికి కేటాయించింది కేవలం రు. 500 కోట్లు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి ఈ మధ్య బాగా వివాదాస్సదమయింది. బాబు వస్తే జాబు వస్తుందనేది టిడిపి ఎన్నికల నినాదం. హామీ ఇచ్చినట్టు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగమయిన ఇవ్వాలి లేదా నెలకు రు. 2000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తూ వస్తున్నది. మూడేళ్ల తర్వాత డిమాండ్ కు స్పందిస్తూ తొందర్లో నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించింది. దీనిని అమలు చేసేందుకు ఇపుడు బడ్జెట్లో రు. 500 కోట్లు కేటాయించారు. అయితే, ఈమొత్తం సరిపోతుందా, అనుమానమే. ఇది విమర్శలకు తావిచ్చే ప్రమాదం ఉంది.

బడ్జెట్ విశేషాలు

బడ్జెట్‌ మొత్తం: రూ.లక్షా 56వేల 999 కోట్లు

ఆర్థికలోటు - రూ. 23,054 కోట్లు

రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు

వివిధ శాఖలకు కేటాయించిన మొత్తాలు

హోంశాఖ- రూ. 5,221 కోట్లు

రోడ్లు, భవనాలశాఖ- రూ. 4, 041 కోట్లు

నిరుద్యోగ భృతి- రూ. 500 కోట్లు

శాప్‌- రూ. 195 కోట్లు

విద్యుత్‌శాఖ- రూ. 4,311 కోట్లు

రాజధాని ప్రాంత అభివృద్ధికి రూ. 1,061 కోట్లు

మున్సిపల్‌శాఖ- రూ. 5,207 కోట్లు

స్కిల్‌డెవలప్‌మెంట్‌- రూ. 398 కోట్లు

జలవనరులశాఖ- రూ. 12,770 కోట్లు

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7021 కోట్లు

ఉన్నత విద్యకు రూ. 3513 కోట్లు

పాఠశాల విద్యకు రూ. 17,197 కోట్లు

డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1600 కోట్లు

పెన్షన్లు రూ. 4376 కోట్లు

ఎన్టీఆర్‌ సుజల స్రవంతికి రూ.100 కోట్లు

పంచాయతీరాజ్‌శాఖ రూ. 6562 కోట్లు

గృహ నిర్మాణశాఖ రూ. 1457 కోట్లు

పౌరసరఫరాలశాఖ రూ. 2800 కోట్లు

ఎన్టీఆర్‌ క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు

ఎల్‌పీజీ కనెక్షన్ల కోసం రూ. 350 కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవ రూ. 1000 కోట్లు

గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు

రైతు రుణమాఫీకి రూ. 3600 కోట్లు

మహిళా సాధికార సంస్థకు రూ. 400 కోట్లు

స్త్రీ, శిశువు, వికలాంగులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ. 1773 కోట్లు

దివ్యాంగులను పెళ్లిచేసుకుంటే ప్రోత్సాహం రూ. 50వేల నుంచి లక్షకు పెంపు

వికలాంగుల సంక్షేమానికి రూ. 89 కోట్లు

బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 75 కోట్లు

కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు

రాష్ట్ర క్రైస్థవ కార్పొరేషన్‌కు రూ. 35 కోట్లు

మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌసమ్‌లకు రూ. 24 కోట్లు

వక్ఫ్‌ సర్వే కమిషన్‌కు రూ. 50 కోట్లు

జెరూసెలెం యాత్రికులకు సాయం రూ. 20వేల నుంచి 40వేలకు పెంపు

కొత్త చర్చిల నిర్మాణానికి సాయం రూ. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు