పార్టీ మారాలనుకున్నా..కానీ మారటం లేదు.

పార్టీ మారాలనుకున్నా..కానీ మారటం లేదు.

టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరాలనుకున్న మాజీ ఎంఎల్ఏ యలమంచిలి రవి ఒక్కసారిగా యు టర్న్ తీసుకున్నారు. ఈనెల 10వ తేదీన వైసిపిలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్న రవి హటాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. ఆదివారం జరిగిన పరిణామాల్లో చంద్రబాబునాయుడుతో రవి భేటీ జరిగింది. తర్వాతే తాను పార్టీ మారటం లేదని స్పష్టంగా  ప్రకటించారు. పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని అయితే ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మీడియాతో చెప్పటం గమనార్హం.

రవి పార్టీ మారుతున్నారంటూ కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు రవిని పిలిపించుకొని మాట్లాడారు. పార్టీ మారే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని రవికి హామీ ఇచ్చారు. బాబుతో భేటీ అనంతరం మీడియాతో రవి మాట్లాడుతూ, పార్టీ మారాలనుకున్న మాట వాస్తవమేనని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచన విరమించుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు హామీతో తాను సంతృప్తి చెందానన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos