Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో ఇసుక కొరత.. మరో కార్మికుడు మృతి

ఈ ఇసుక కొరత నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ దీక్ష కూడా చేపట్టారు. ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు దీక్షకు దిగారు.సాయంత్రం ఐదు గంటల వరకు నారా లోకేష్ ఈ దీక్షలో పాల్గొన్నారు.
 

worker commits suicide in tadepalligudem over sand issue
Author
Hyderabad, First Published Nov 2, 2019, 10:10 AM IST

ఏపీలో ఇసుక కొరత వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఇసుక కొరత కారణంగా మరో కార్మికుడు బలయ్యాడు.  తాడేపల్లి మండలం ఉండవల్లిలో నాగరాజు అనే తాపీ మేస్త్రీ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.... ఇటీవల కూడా ఇద్దరు కార్మికులు ఇదే కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

worker commits suicide in tadepalligudem over sand issue

కాగా.... ఈ ఇసుక కొరత నేపథ్యంలో ఇటీవల మాజీ మంత్రి, టీడీపీ నేత లోకేష్ దీక్ష కూడా చేపట్టారు. ఇసుక కొరతను నిరసిస్తూ గుంటూరు కలెక్టరేట్ ముందు టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు దీక్షకు దిగారు.సాయంత్రం ఐదు గంటల వరకు నారా లోకేష్ ఈ దీక్షలో పాల్గొన్నారు.

గుంటూరు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో  ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి లోకేష్ దీక్షను ప్రారంభించారు.ఈ దీక్షలో లోకేష్ తో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలో పాల్గొన్నవారికి ఇసుక  నింపిన ప్యాకెట్లతో తయారు చేసిన దండలను వేశారు. 

ఇసుక కొరత కారణంగా ఏపీ  రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవన నిర్మాణ కార్మికులు పని లేక ఆందోళనకు దిగుతున్నారు. ఇసుక కొరత వల్లే తమకు పనులు లేకుండా పోయాయని భవన నిర్మాణ కార్మికులు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్ తీసుకొంటున్న నిర్ణయాల కారణంగానే ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని టీడీపీ విమర్శిస్తోంది. భవన నిర్మాణ కార్మికుల అండగా ఏపీ రాష్ట్రంలో భవని నిర్మాణ కార్మికుల అండగా ఉంటామని జనసేన కూడ ప్రకటించింది.ఈ నెల 3వ తేదీన విశాఖ జిల్లాలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టనున్నారు.

ఇప్పటికే ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ సమర శంఖారావం పూరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు నిరసన తెలిపింది తెలుగుదేశం పార్టీ. పలు రకాలుగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించింది.

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నారు. ఇసుకదొరక్క ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రభుత్వం మెుండివైఖరితో ముందుకు వెళ్తోందని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios