కర్నూలు జిల్లాలో కనీవినీ ఎరగని వింత చోటుచేసుకుంది.  భూమిలోపల నుంచి మంటలు వస్తున్నాయి. జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండాలో ఈ వింత చోటుచేసుకుంది.

భూమి రెండు భాగాలుగా చీలి.. అందులో నుంచి మంటలు వస్తున్నాయి.  ఆ మంటల ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోవడం గమనార్హం. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఈ మంటలు ఎలా వస్తున్నాయనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు.